calender_icon.png 19 February, 2026 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునుగోడులో వైన్ షాపులపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

19-02-2026 05:33:03 PM

సాయంత్రం 6 లోపు పర్మిట్ రూమ్‌లలో మద్యం సేవనానికి కఠిన నిషేధం

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): నియోజకవర్గ కేంద్రంలో వైన్ షాపుల సమయపాలనపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

సాయంత్రం 6:00 గంటల వరకు పర్మిట్ రూమ్‌లలో గానీ, షాప్ పరిసర ప్రాంతాల్లో గానీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవనానికి అనుమతి లేదని మరోమారు గట్టిగా హెచ్చరించారు. సమయపాలనలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని తెలిపారు.వైన్ షాపుల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.నియోజకవర్గంలో చట్టాలు, నియమాలు కఠినంగా అమలు కావాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.