14 March, 2026 | 6:36 AM

అబ్రంలింకన్‌ను ఢీకొన్న క్షిపణి

14-03-2026 01:08 AM
  1. అమెరికా యుద్ధ విమానాన్ని బాలిస్టిక్ క్షిపణుతో దాడిచేశామన్న ఇరాన్
  2. ఎర్రసముద్రంలో సేవలందిస్తోందన్న అమెరికా

టెహ్రాన్, మార్చి 13: అమెరికా విమాన వాహకనౌక అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని తెలిపింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్‌పై అమెరికా చేస్తోన్న ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’కి ఈ నౌక తమ సేవలు అందిస్తోందని ఇరాన్ ప్రకటనలను ఖండించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం..

అబ్రహం లింకన్‌కు అతిదగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చింది. దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ ఘటనలో యూఎస్ నౌక దెబ్బతిన్నదా, లేదా అని మాత్రం పేర్కొనలేదు. ఇక, ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ సేనలు దీనిని దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో ఎనిమిది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉంటాయి.

అబ్రహం లింక్ప దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల తర్వాత నాలుగు క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీస్థాయిలో హైపర్‌సోనిక్, నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ విమాన వాహక నౌకను తాకడం దాదాపుగా అసాధ్యమనే చెబుతుంటారు. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో.. ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ సమీపంలో మోహరించిన అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ జెరాల్ ఆర్ ఫోర్డ్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ‘జెరాల్డ్లోని లాండ్రీ ప్రదేశాల్లో ఈ మంటలు చెలరేగాయి. అయితే అందుకు యుద్ధం కారణం కాదు. ఆ మంటలను ఆర్పేశాం. నౌకలోని ప్రొపల్షన్ ప్లాంట్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. గాయపడిన ఇద్దరు నావికులకు చికిత్స అందుతోందని, ఈ నౌక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఎర్రసముద్రంలో తన సహకారాన్ని కొనసాగిస్తోంది అని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.