20-02-2026 01:53:39 AM
ఛత్రపతి శి వాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. ‘రాజా శివాజీ’ టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠా సామ్రాజ్య స్థాపన, స్వరాజ్యం కోసం శివాజీ చేసిన పోరాటాలను ఇందులో చూపించబోతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్న రితేశ్ ఇందులో హీరోగానే కా కుండా, ఆయనే ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని రితేశ్ భార్య, నటి జెనీలియా జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇదే ఏడాది వేసవి కానుకగా మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరాఠీతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. గురువారం శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ డేట్‌ను సైతం అధికారికంగా ప్రకటించారు. ఒక చేతిలో తల్వార్, మరో చేతిలో కాషాయ జెండా పట్టుకుని యుద్ధానికి సిద్ధమైన ఛత్రపతి శివాజీ పాత్రలో ఉన్న రితేశ్ లుక్ తాజా పోస్టర్‌లో ఆకట్టుకుంటోంది.