14 May, 2026 | 4:29 PM

చెట్ల చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రులు

14-05-2026 03:10 PM

నల్లగొండ, మే 14 (విజయక్రాంతి) : జిల్లాలోని చెట్ల చెన్నారంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎంత..? మిల్లులకు తరలించినది ఎంత..? ఇంకా కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం ఎంత..? అనే ప్రశ్నలు వేయడంతో అధికారులు కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల కొరతతో ఆలస్యం జరగకుండా వెంటనే అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలనీ, హమాలీల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తదుపరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.