9 August, 2026 | 10:49 PM

అదనపు గదులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్

20-05-2026 12:38 AM

రామచంద్రపురం, మే 19 : రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ పరిధిలో గల కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అదనపు తరగతి గది నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

గత పది సంవత్సరాలుగా ఉస్మాన్ నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.