9 June, 2026 | 2:45 AM

10న సిద్ధాపూర్‌కు మంత్రి ఉత్తమ్ రాక

09-06-2026 01:42 AM

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, జూన్ 8 (విజయ క్రాంతి):  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బాన్సువాడ నియోజకవర్గానికి ఈనెల 10 వ తేదీ బుధవారం రోజున భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా 106 కోట్లతో నిర్మించిన జాకోర , చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవo,సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో సోమవారం హెలిప్యాడ్ స్థలం, సభ స్థలం ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు. రైతులు ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, వర్ని చందూర్ మండలాల నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.