21 March, 2026 | 5:19 AM

మండలిలో మంత్రి ఉత్తమ్ ‘బడ్జెట్’

21-03-2026 02:03 AM

బడ్జెట్ ప్రసంగమంతా ఇంగ్లిష్‌లోనే

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): శాసన మండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌లో గతం కంటే ఎక్కువగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. మండలిలో ఉత్తమ్ ప్రసంగమంతా ఇంగ్లీషులోనే సాగింది. ఆరు గ్యారంటీల అమలు అంశం ప్రస్తావన సమయంలో విపక్ష పార్టీ సభ్యలు అవాస్తవాలు చెపుతున్నారని అభ్యంతరం చెప్పారు. విపక్ష సభ్యులు అభ్యంతర చెప్పినా మంత్రి తన ప్రసంగం ఆగకుండా చదివారు.