బియ్యం ఎగుమతుల్లో స్కామ్ లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ బియ్యానికి డిమాండ్ ఎక్కువ
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
హైదరాబాద్: ఫిలిప్పీన్స్, తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఒప్పందం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అసెంబ్లీలో తెలిపారు. ఫిలిప్పీన్స్ లో జరిగిన అంతర్గత వివాదాల వల్ల కాకినాడలో బియ్యం ఆగాయని వివరించారు. తెలంగాణ బియ్యానికి మాత్రం ఫిలిప్పీన్స్ అనుమతి ఇచ్చిందన్నారు. కాకినాడ పోర్టు వద్ద ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ హ్యాండ్లింగ్ చేస్తోందని తెలిపారు. గిడ్డంగి, షిప్పింగ్, బీమా అన్నీ ఫిలిప్పీన్స్ చూసుకుంటోందన్నారు. ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్ చంద్ గార్గ్ కు ఏమీ సంబంధం లేదని సూచించారు.
తమకు రైతుపక్షపాత ప్రభుత్వమని చెప్పిన మంత్రి ఉత్తమ్ రైతుల నుంచి రికార్డు స్థాయిలో బియ్యం సేకరించామని వివరించారు. ఇంకా మిగిలిన బియ్యాం కూడా కొంటామని హామీ ఇచ్చారు. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదే నని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 86 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉంది.. పంపించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. తాము మాత్రం బియ్యాన్ని మంచి ధరకే విక్రయించామని వెల్లడించారు. ఇటీవల 72 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేశామన్నారు.
ఛత్తీస్ గఢ్, ఏపీ బియ్యం కంటే తెలంగాణ బియ్యానికే డిమాండ్ ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ కు బియ్య ఎగుమతుల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రేమ్ చంద్ గార్గ్ ను ప్రభుత్వ అడ్వైజర్ గా పెట్టుందన్నారు. ప్రేమ్ చంద్ గార్గ్ సీబీఐ, ఈడీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారని ఆరోపిపంచారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఉత్తమ్ హరీశ్ రావు ఆరోపణలు పూర్తి అవాస్తవం అన్నారు. హరీశ్ రికమండేషన్ ను ప్రభుత్వం ఆమోదించలేదని సభలో పూర్తిగా అవాస్తవాలు మాట్లాడరని ఉత్తమ్ మండిపడ్డారు.




