కోదాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ దిగ్భ్రాంతి
సూర్యాపేట ఆగస్టు 26(విజయక్రాంతి): కోదాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై(Kodad Road Accident) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం(Kodad Mandal) శివార్లలోని ద్వారకుంట వద్ద, హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని(Hyderabad to Andhra Pradesh) ఏలూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురవడంతో కనీసం ఆరుగురు మరణించగా, 20 మంది గాయపడ్డారు. సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో(Suryapet Road Accident) ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స అందేలా చూడాలని సీఎం ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అలాగే, క్షతగాత్రుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.






