ముత్తారం మాజీ జడ్పీటీసీకి అస్వస్థత
26-08-2026 11:48 AM
ముత్తారం, ఆగస్టు 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. గుండెకు స్టెంట్ వేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
జగన్‌మోహన్‌రావు ఆరోగ్య పరిస్థితిపై ముత్తారం మండల ప్రజలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకుంటున్నట్లు తెలిసింది.






