సూర్యాపేట రోడ్డుప్రమాదంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Suryapet Road Accident) తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంటైనర్‌ను ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబసభ్యులకు ప్రసాదించాలని కేటీఆర్(KTR) ప్రార్థించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.






