26 August, 2026 | 4:40 PM

కేసీఆర్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది..కానీ భయపడాల్సి వస్తుంది..?

26-08-2026 11:41 AM

కూకట్‌పల్లి,ఆగస్టు26(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తీసుకొచ్చిన Section 22A పై విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కూకట్‌పల్లిలో 22ఏ నిషేధిత భూముల బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని, ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రజల నుంచి భూములు సేకరించి వాటిని అధికార పార్టీ అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమన్నారు. 

ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) హయాంలో తెలంగాణలో భూముల విలువ పెరిగిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత బలపడిందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి ఎకరాలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని హరీష్ రావు ఆరోపించారు. ప్రజల ఆస్తులను 22ఏ(22A) జాబితాలో చేర్చిన ప్రభుత్వమే వాటిని తిరిగి జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.