అధిష్టానం చేతిలో కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్
కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు తప్పదా?
అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదికను(Disciplinary Committee Report) ఫైనల్ చేసి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(PCC Chief Mahesh Goud)కు పంపడంతో ఆయన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు నివేదిక అందజేశారు. మీనాక్షి నటరాజన్ నివేదికను ఏఐసీసీకి సమర్పించనున్నారు. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ అధిష్ఠానం చేతిలోకి వెళ్లింది.
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అధిష్ఠానం తీసుకోనున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అభిప్రాయాలు తీసుకోనున్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), చిన్నారెడ్డిపై 20 మందికి పైగా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇద్దరిపైనా చర్యలకు కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అయినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.






