26 August, 2026 | 11:38 AM

భార్య దూరం కావడంతో భర్త మృతి

26-08-2026 10:35 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): భార్యాభర్తలు విడిగా ఉండడంతో భర్త మృతి చెందిన ఘటన చినుర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చినుర్ గ్రామానికి చెందిన తలకొకుల సత్యం, సుమారు 37 సంవత్సరాలు క్రితం తలకోకుల వరమానిని వివాహం చేసుకున్నాడు. గత 30 సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. ఆకారణంతో వరమని తన పిల్లలతో కలిసి హవేలీ ఘనపూర్ మండలంలో తన తల్లి ఇంటి వద్ద నివసిస్తుంది. దానితో సత్యం సన్యాసం స్వీకరించి చినుర్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నాడు.

గత వారం రోజుల క్రితం సత్యం గ్రామంలోని కల్లు దుకాణం వద్ద కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.సత్యం ఇంటి వద్ద నుండి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు భార్య వరమానికి సమాచారం అందించారు. భార్య సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన భర్త సత్యం ఇంట్లో మృతి చెందాడు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉన్నట్లు గుర్తించింది. సత్యం సరిగా ఆహారం తీసుకోకుండా తరుచూ కల్లు త్రాగుతూ ఒంటరిగా జీవించేవాడని ఈ కారణంతోనే మృతి చెంది ఉండవచ్చునని భార్య వరమాని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతునికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.