26 August, 2026 | 12:12 PM

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు తాత్కాలిక బ్రేక్

26-08-2026 11:22 AM

ప్రపంచవ్యాప్తంగా వీసా షెడ్యూల్ లో భారీ మార్పులు

వీసా స్క్రీనింగ్ మరింత కఠినతరం చేసే యోచన

వాషింగ్టన్,ఆగస్టు 26(విజయక్రాంతి): అమెరికా వీసా అపాయింట్‌మెంట్ల షెడ్యూల్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వీసా అపాయింట్ మెంట్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్లలో అధికారులకు ప్రత్యేక గ్లోబల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిక్స్ అయిన కొన్ని వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. రీషెడ్యూల్ వివరాలను దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు. వీసా స్క్రీనింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా అమెరికా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.