వెలుగుమట్ల పేదలకు ఇళ్ల స్థలాలు.. సీఎంకు మంత్రి తుమ్మల విన్నపం
09-03-2026 03:32 PM
సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మంత్రి తుమ్మల సీఎంతో చర్చించారు. నర్మెట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం కావాలని మంత్రి కోరారు. కొహెడ మార్కెట్ పనులు చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, మినుము కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తుమ్మల సీఎంకు తెలిపారు. ఖమ్మం వెలుగుమట్ల పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని తుమ్మల మంత్రి విన్నవించారు. మంత్రి తుమ్మల ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.




