22 April, 2026 | 1:45 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

గంజాయి, డగ్స్ రవాణాపై ఉక్కుపాదం

10-03-2026 12:00 AM
  1. ప్రత్యేక దాడులు నిర్వహించనున్న అబ్కారీ శాఖ
  2. నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ అరికట్టడమే లక్ష్యం
  3. ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం 

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్, నాన్ డ్యూటి పెయిడ్ లిక్క ర్ తెలంగాణలోకి దిగుమతి కాకుండా ప్రొ హిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అదనంగా ప్రత్యేక తనిఖీలకు బృందాలను ఎక్సైజ్ శాఖ నియమించింది. హట్ స్పాట్స్‌ను గుర్తించి అబ్కా రీ శాఖ దాడులను ముమ్మరం చేసింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది.

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటం తో ఎన్డీపీఎల్ రవాణ,అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలోని నాలుగు ఎస్టీఎఫ్ టీమ్‌లు, ఎన్ఫోర్స్ మెంట్ టీమ్‌లు, జిల్లా స్థాయిలో డీటీఎఫ్ టీ మ్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు.. దాడులు నిర్వహిస్తున్నాయి. హైదరా బాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్, గంజా యి, ఎన్డీపీఎల్ అమ్మకాలపై నిఘా పెట్టడానికి కొన్ని హట్ స్పాట్స్‌ను ఎంపిక చేశారు.

ధూళిపేట్, నారాయణగూడ, ఫతేనగర్, సీ తాఫల్‌మండి, నేరెడ్‌మెట్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, అన్నోజిగూడ, ముగూరు బస్తీలను గుర్తించారు. వీటితో పా టు రైళ్ల తనిఖీలు, చెక్ పోస్టు వద్ద నిఘా పెం చడం చేస్తున్నారు. అంతే కాకుండా ఢిల్లీ, నో యిడా, గోవా, హర్యానా, ప్రాంతాల నుంచి నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ ఎక్కువగా వస్తున్నట్లు అబ్కారీ శాఖ గుర్తించింది.

ఏయిర్ పోర్టు, రైళ్లు, చెక్‌పోస్టుల నుంచి వస్తున్న ఎన్డీపీఎల్ మద్యాన్ని అరికట్టడానికి స్పెషల్ డ్రై వ్స్ చేపడుతున్నారు. హైదరాబాద్‌లో 2025 లో ఎయిర్ పోర్టు ద్వారా వచ్చిన మద్యాన్ని శంషాబాద్, సరూర్‌నగర్ , మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధి లో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో 335 లీటర్ల మద్యాన్ని 43 కేసుల్లో పట్టు కున్నారు. 2025లో ఈ మూడు స్టేషన్లలో 337  కేసుల్లో 3631 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో మొ త్తంగా 1251 కేసుల్లో 16,103 మద్యాన్ని సీజ్ చేశారు. ఎన్డీపీఎల్ మధ్యంతో పాటు గంజాయిని కూడా భారీగా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. ప్రభుత్వం అదేశాల  మేర కు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా దాడులను మరింతగా ముమ్మరం చేస్తామన్నారు.