13 April, 2026 | 3:25 AM

ఔదార్యాన్ని చాటుకున్న మంత్రి తుమ్మల

13-04-2026 12:00 AM

ఖమ్మం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఖమ్మం మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల దగ్గరకి  స్వయంగా వెళ్లిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి  యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి, సత్వరమే పరిష్కారం చేపిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. సందర్భంగా వారు మంత్రి తుమ్మలకి కృతజ్ఞతలు తెలియజేశారు.