13 April, 2026 | 5:14 AM

లిటిల్ ఫ్లవర్స్ ఆల్ టైం రికార్డ్

13-04-2026 12:00 AM

994 మార్కులతో రికార్డ్ సృష్టించిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు

లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు, రమేష్ బాబు

భద్రాచలం, ఏప్రిల్ 12,  (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ బోర్డు ఆదివారం విడుదల చేసిన ఫలితాలలో భద్రాచలం లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థిని విద్యార్థులు కానీ విని ఎరగని మార్కులతో ఆల్ టైం రికార్డును సృష్టించారు. మొదటి ద్వితీయ పరిక్షా ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు.

ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థి డి భువన్ 994/1000 మరియు బైపీసీ విభాగంలో బి హాసిని 994/1000. మార్కులు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఆల్టైమ్ రికార్డును నెలకొల్పారు వీరితోపాటు ఎంపీసీ విభాగంలో మౌనిష్ 992/1000 జి యశ్విత 992/1000 ఎస్ చైత్ర వదన 990/1000 జి రామ్ తేజ్ 988/ 1000 కే సతీష్ 987/1000 కే అఖిల్ 987/1000 బి సుమన్య శ్రీ 981/1000 ఎస్ నాగ శ్రీవల్లి 981/1000 మార్కులు సాధించగా బైపిసి ద్వితీయ సంవత్సరంలో సైతం కే వర్షిత వర్ధిని 984/1000 ఎండి నౌషిన్ 980/1000 మార్కులతో ఇంటర్ ఫలితాలలో లిటిల్ ఫ్లవర్స్ కి సాటి లేదని చాటి చెప్పారు. ద్వితీయ సంవత్సరంతో పాటు మొదటి సంవత్సరం ఫలితాలలోను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రస్థానం లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలేనని ఆదివారం విడుదల చేసిన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగానికి చెందిన సిహెచ్ గీతిక 467/470 కే గీతిక 467/470 ఆర్ కళ్యాణ్ 466/470 ఎం నిఖిల్ 466/470 ఎండి అంజుమ్ 466/470 ఎస్.కె అనాజ్ 465/470 డి జోషిక 465/470 జి .ప్రైజి 464/470 దేవేందర్ రెడ్డి 464/470 సిహెచ్ మనోజ్ 461/470 యు నక్షత్ర 461/470 లక్ష్మీ కృష్ణ 460/470 మార్కులతో విజయ డంకా మోగించగా బైపిసి విభాగంలోనూ కే ప్రణయ్ 436/440 టిచంద్రిక 436/440 యు హర్షిత 425/440 మార్కులు సాధించగా ఎంఈసి విభాగంలోనూ లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులే అగ్రస్థానంలో నిలిచారు. ఎంఈసీ విభాగంలో యు అనన్య 491/500 468/500 మార్కులతో సత్తా చాటగా సి ఈ సి విభాగంలో భావన చహన్ 479/500 డి నిషితరెడ్డి 472/500 బి సువర్ణ 466/500 ఎండి అర్పియా 465/500 మార్కులు సాధించగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్య చరిత్రలోనే ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతూ లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు నూతన రికార్డులను సృష్టించారని చెప్పాలి. 

సమిష్టి కృషితోనే అసాధారణ ఫలితాలు సాధించినట్లు లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబు తెలిపారు.  రానున్న ఎంసెట్ పోటీ పరీక్షకు సైతం లిటిల్ ఫ్లవర్స్ విద్య సంస్థలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో గణిత అధ్యాపకులు ఎండి బషీర్ కళాశాల బోధన బోధ నేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు  పాల్గొన్నారు.