26 July, 2026 | 4:59 PM

బ్రిడ్జి మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే

26-07-2026 03:56 PM

బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ ప్రధాన రహదారిలో గల బ్రిడ్జి మరమ్మతులను ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. నాణ్యమైన పదార్థాలతో బ్రిడ్జి పనులను త్వరతరగతిన పూర్తి చేయాలని సూచించారు. వీరి వెంట మాజీ సర్పంచ్ అబ్దుల్లా, నాయకులు అభిరాం రెడ్డి, కేమ శ్రీకాంత్, సతీష్ రెడ్డి, రవికాంత్, నాగిరెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి, సురేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.