ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు పర్యటన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) అభివృద్ధి చేస్తున్న ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ సిటీ'(Future City) ప్రాజెక్టు, దేశం మొత్తానికే ఒక ఆదర్శంగా నిలిచే దిశగా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) గురువారం పేర్కొన్నారు. మంత్రులు ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనుల్ని క్షేత్రస్థాయిలో సమీక్షించి అధికారులకు మార్గ నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోందని తెలిపారు. నైపుణ్య విశ్వవిద్యాలయం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ఒక కేంద్రంగా ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి FCDA కార్యాలయం సహాయపడుతుందని వెల్లడించారు. నిర్మాణ పనులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తయ్యేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు "భారత్ ఫ్యూచర్ సిటీ" గ్రోత్ ఇంజన్
''రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు "భారత్ ఫ్యూచర్ సిటీ" ఒక గ్రోత్ ఇంజన్ లా మారనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు సహచర మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనుల్ని క్షేత్రస్థాయిలో సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేలా మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ "భారత్ ఫ్యూచర్ సిటీ"ని అభివృద్ధి చేస్తోంది.'' అని మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్ లో పోస్టు చేశారు.






