15-02-2026 01:39:47 PM
హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి భీమేశ్వరాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి మండల కేంద్రంలోని శివాలయంలో స్వామివారిని, పొట్లపల్లి స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు, ఉపవాసాలు, జాగరణలు చేస్తూ ఆ మహాదేవుడిని ఆరాధించే భక్తకోటికి సుఖ సంతోషాలను, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.