calender_icon.png 15 February, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

15-02-2026 01:06:06 AM

‘బ్రైట్ ప్రిన్స్’ తారిఖ్?

బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించింది. ఆ దేశ నూతన ప్రధాని, పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా తారిఖ్ రెహమాన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన ముందు జూలై చార్టర్ సంస్కరణల అమలు, మైనార్టీ వర్గాల రక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం వంటి సవాళ్లున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని ‘డార్క్ ప్రిన్స్’ తారిఖ్ ‘బ్రైట్ ప్రిన్స్’గా ఎదుగుతారని ఆ దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 

అభినవ స్టాలిన్ అవుతారా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఏంకే ఈజీగా గెలిచింది..  ఈసారి టగ్ ఆఫ్ వార్ తప్పేట్లు లేదు. క్రితం సారి ఏఐడీఎంకేని ఎదుర్కొవడంతో సరిపోయింది. డీఎంకేకి ఈసారి రెండు కొత్త చిక్కులు వచ్చాయి. ఒకటి బీజేపీతో జతకట్టిన ఏఐడీ ఎంకే, రెండు సినీస్టార్ విజయ్ పార్టీ టీవీకే. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ నాడు ప్రపంచ యుద్ధంలో  విజేతగా నిలిచిన స్టాలిన్ అవుతారా? అన్న చర్చ మొదలైంది.