22 April, 2026 | 1:31 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి

22-04-2026 11:40 AM

32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలం

సామాన్యులకు ఇబ్బందులు కలిగించవద్దు..

సమస్యల పరిష్కారంపై సర్కార్ సానుకూలం 

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని కోరారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదని ఆర్టీసీ కార్మికులకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేశామని సూచించారు. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నామనడం పొరపాటు అన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని పొన్నం తెలిపారు. 32 అంశాల్లో 29 అంశాలను తక్షణమే పరిష్కారం చేయదగినవే అన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలనే అంశం పెట్టింగ్ ఉందని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర చర్చిస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు నిరసన తెలపవచ్చు.. మిగతా వారు విధుల్లో చేరాలని మంత్రి పిలుపునిచ్చారు. పేదల ప్రయాణాలకు ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు కలగజేయవద్దని కోరారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డిమాండ్లు పరిష్కరించుకుందామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో(RTC strikeప్రజా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బంద్ కావడంతో ప్రైవేట్ వాహన దారులు ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.