22 April, 2026 | 1:04 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు

22-04-2026 11:16 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెతో(TGSRTC Strike) జిల్లాలో బస్సుల రాకపోకలు బుధవారం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సమ్మె కారణంగా చాలా మార్గాల్లో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌తో పాటు పలు మండల కేంద్రాల్లో కూడా బస్సుల రాకపోకలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌కు చేరుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూసినప్పటికీ చాలా మార్గాల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందారు.

బస్సులు నడవకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలను(Private vehicles) ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ బాలాజీ వరప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి డిపోను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో రాబోయే రోజుల్లో బస్సుల రాకపోకలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.