రేపటి నుంచి "పాలేరు"లో 'ప్రజా దర్బార్'
నేలకొండపల్లి మండలం బోదులబండలో రేపు మధ్యాహ్నం 2:30కు..
ఎల్లుండి ఉదయం 8 గంటలకు కూసుమంచిలో, మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో
కూసుమంచి , మే 1(విజయ క్రాంతి): పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే చేర్చే లక్ష్యంతో తెలంగాణ, రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపట్టిన 'ప్రజా దర్బార్' కార్యక్రమాలు శనివారం (రేపు) మధ్యాహ్నం 02:30 గంటలకు నేలకొండపల్లి మండలం బోదులబండ క్లస్టర్ పరిధిలోని ప్రజా దర్బార్ బోదులబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది. బోదులబండ, మోటాపురం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, పైనంపల్లి, చెన్నారం, కోరట్లగూడెం, మండ్రాజుపల్లి, సుర్దేపల్లి, రామచంద్రపురం, కొత్తకొత్తూరు, తిరుమలాపురం గ్రామాల ప్రజలు హాజరు కావొచ్చు.
ఆదివారం (ఎల్లుండి): కూసుమంచి మండలం కూసుమంచి క్లస్టర్ పరిధిలో ఉదయం 08:00 గంటల నుంచి కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది. కూసుమంచి, ఈశ్వరమాదారం, రాజుపేట బజార్, రాజుపేట, గోరిలాపాడు తండా, అజ్మీరా హీరామన్ తండా, జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, పెరికసింగారం, మల్లేపల్లి, గట్టుసింగారం, జుజ్జులరావుపేట, మల్లాయిగూడెం, లింగారంతండా, గంగబండ తండా గ్రామాలకు చెందిన ప్రజలు హాజరు కావొచ్చు. అదే రోజు మధ్యాహ్నం 02:30 గంటలకు బచ్చోడు క్లస్టర్ పరిధిలో బచ్చోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది. బచ్చోడు, బచ్చోడు తండా, బీరోలు, ఏలువారి గూడెం, పైనంపల్లి, రాజారం, సోలిపురం, మంగలి బండ తండా, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ఏనుకుంటతండా గ్రామాలకు చెందిన ప్రజలు హాజరు కావొచ్చు.
చెంతకే యంత్రాంగం.. వేదికపైనే పరిష్కారం
ఈ సదస్సులలో ప్రధానంగా భూ సమస్యలు , ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, పింఛన్లు వంటి అంశాలపై ప్రజల నుంచి విన్నపాలను స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు వేదికపైనే అందుబాటులో ఉండాలని, అర్హులైన బాధితులకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత 39 గ్రామాల ప్రజలు తమ సమస్యల దరఖాస్తులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.






