29 August, 2026 | 4:42 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర

29-08-2026 03:56 PM

టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం.. అఖిలపక్షాల సంఘీభావం

ఎర్రుపాలెం ఆగస్ట్ 29: (విజయక్రాంతి): రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ(Journalists) ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఖమ్మం జిల్లాస్థాయి పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలో కొనసాగింది. మండల కేంద్రంలోని రింగ్‌ సెంటర్‌ నుంచి స్థానిక జర్నలిస్ట్ లతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి, రైల్వే స్టేషన్‌ సెంటర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్‌ కె. సునీత ఎలిజిబెత్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా ప్రభుత్వానికి తమ వినతిని తెలియజేయాలని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన కోర్కెను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కల్పించాలని అఖిలపక్ష నాయకులు కోరారు.

అఖిలపక్షాల సంఘీభావం

పాదయాత్రకు మండలంలోని వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మధిర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బండారు నరసింహారావు, గ్రామపంచాయతీ సర్పంచ్‌ నండ్రు అశ్విని, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శీలం కవిత, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరెడ్డి, దోమందుల సామేలు, బీజేపీ మండల అధ్యక్షుడు అనుమోలు సురేష్‌, నూతక్కి నరసింహారావు, సీపీఎం నాయకులు గామాసు జోగయ్య, నాగులవంచ వెంకటరామయ్య, యూటీఎఫ్‌ నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, కంచర్ల శ్రీనివాసరావు, నండ్రు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్ర నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టుల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

 పాల్గొన్న నాయకులు 

టిడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్‌ ఖదీర్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి తేనే వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్‌, సహాయ కార్యదర్శి కొత్త యాకేష్‌, టిబీజేఏ జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్‌, స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యురాలు నలబోల మధుశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.ఎస్‌. చక్రవర్తి, రాష్ట్ర నాయకులు మారెడ్డి నాగేందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దగ్గుపాటి మాధవరావు, జానీ పాషా, కొరకొప్పుల రాంబాబు, గుడిమెట్ల మోహన్‌రావు, టిబీజేఏ కెమెరామెన్స్‌ జిల్లా కార్యదర్శి భూక్యా గణేష్‌, కోశాధికారి యూసఫ్‌, అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యుడు అర్షద్‌, నాయకులు గంగుల గోపి, మందా శరత్‌, చిర్రా పవన్‌, తిరుపతిరావు, ఎండి షకీల్‌ మహ్మద్‌, సామ్రాట్‌ గుప్తా, కెదాసి కిరణ్‌కుమార్‌, మండల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.