29 August, 2026 | 4:38 PM

కాంగ్రెస్ మోసాలపై వారం రోజులపాటు నిరసనలు

29-08-2026 03:46 PM

పార్టీ ముఖ్య నాయకులు విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి 

దేవరుప్పుల, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 మోసపూరిత హామీలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలపై వారం రోజులపాటు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420  మోసపూరిత హామీలు ఇచ్చి గద్దె నెక్కి 1000 రోజులు పూర్తి అవుతున్న హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అని స్పష్టం చేశారు.పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్షపూరిత చర్యలకు దిగుతున్నరని మండిపడ్డారు.పాలకుర్తి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని విమర్శించారు.

ప్రతి కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రతి ఇంటికి వివరించాలని సూచించారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్ మాజీ ఎంపీపీ కొల్లూరి సోమన్న మండల కార్యదర్శి చింత రవి మండల సీనియర్ నాయకులు ఏల సోమ సుందర్ అల్లం ప్రదీప్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి నీలారపు వేణు యాదవ్ తాటి పెళ్లి మహేష్ కోతి ప్రవీణ్ వంగ అర్జున్ కూతాటి నరసింహులు కొత్త జలేందర్ రెడ్డి గడ్డం రాజు భానోత్ నవీన్ నాయక్ ఆయా గ్రామాల సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.