ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది
కష్టాల్లో రాష్ట్రానికి ఆక్షిజన్ ఇచ్చిన వ్యక్తి.. మోదీ
విజయనగరం: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికిందని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం( Alluri Sitarama Raju International Airport) ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. భూములిచ్చిన రైతులకు చంద్రబాబు పాదాభివందనం చేశారు. ఉత్తరాంధ్రకు గూగుల్, స్టీల్ కంపెనీతో పాటు చాలా సంస్థలు వచ్చాయని తెలిపారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశామని తెలిపారు. అనేక ఆటంకాలు అధిగమించి విమానాశ్రయం నిర్మించుకున్నామన్నారు. అల్లూరి పేరు తలచుకుంటేనే గుండె ఉప్పొంగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే ఈ విమానాశ్రయాన్ని నిర్మించారని చెప్పారు. విమానాశ్రయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju), రామ్మోహన్ నాయుడు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన వ్యక్తి.. మోదీ అన్నారు. పోలవరం, రైల్వేజోన్ , విశాఖ ఉక్కును మోదీ కాపాడానని కొనియాడారు. రాజధానికి అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడ్డారని తెలిపారు. 2028కి అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయని చెప్పారు. ఎర్రబస్సు రాదన్నారు.. ఎయిర్ బస్సు వచ్చిందని తెలిపారు.
అవహేళన చేసిన వాల్లు అడ్రస్ లేకుండా పోయారు
అవహేళన చేసిన వాల్లు అడ్రస్ లేకుండా పోయారని స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయంలో అడుగడుగునా తెలుగు సంస్కృతి కనిపిస్తోందన్నారు. బీచ్ కారిడార్.. ప్రకృతి అందాలతో అలరిస్తోందని సీఎం తెలిపారు. ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర దశ, దిశ మారతాయని వ్యాఖ్యానించారు. ఈ విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టిందీ మేమే.. గుమ్మడికాయ కట్టిందీ మేమే అన్నారు. ఉత్తరాంధ్రలో అన్ని రకాల వనరులు ఉన్నాయన్న చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికే వలస వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. రూ. 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. ఈ నెల 14న గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకొచ్చామని ప్రకటించారు. కీలక సమయంలో అండగా నిలబడాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.
మోదీ లాంటి నేతను నా రాజకీయ జీవితంలో చూడలేదు
ప్రధాని మోదీ(Narendra Modi).. 12 ఏళ్లుగా దేశాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ దేశాన్ని డిజిటల్ ఇండియాగా(Digital India) మార్చిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు. పరిపాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకెళ్తున్నారని చంద్రబాబు సూచించారు. రోడ్లు,రైల్వేలు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారని తెలిపారు. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారని చెప్పారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా అరికట్టారని కొనియాడారు. మోదీ లాంటి నేతను నా రాజకీయ జీవితంలో చూడలేదని ఏపీ సీఎం తెలిపారు. ప్రతి విషయంలో నేషన్ ఫస్ట్.. అనే ప్రధానిని తొలి తొలిసారి చూస్తున్నా అన్నారు. భారత్.. 2047 లోగా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మారుతోందని చంద్రబాబు స్పష్టంచేశారు. మోదీ సారథ్యంలో అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. మోదీ వల్ల మనకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చిందన్నారు.






