భారత ఇంధన అవసరాలు తీరుస్తాం
గ్లోబల్ ఇంధన మార్కెట్‌పై ఇరాన్ గుత్తాధిపత్యాన్ని సహించం
అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో
న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ
న్యూఢిల్లీ, మే ౨౩: భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో భరోసానిచ్చారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా తొలిరోజు శనివారం ఆయన న్యూఢిల్లీలోని ‘సేవా తీర్థ్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య డిఫెన్స్, వాణిజ్యం, ఇంధన భద్రత, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై గంటపాటు చర్చించారు. ప్రపంచ శాంతి భద్రతలతోపాటు 2030 నాటికి ఇరు దేశాల వాణి జ్యాన్ని రెట్టింపు చేయాలనే ‘మిషన్ 500’ లక్ష్యంపైనా మంతనాలు చేశారు. ఈ సందర్భంగా రుబియో మాట్లాడుతూ.. పశ్చిమాసి యా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తం గా చమురు సరఫరా నిలిచిపోతున్నదని వాపోయారు.
గ్లోబల్ ఇంధన మార్కెట్‌పై ఇరాన్ గుత్తాధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ముడి చమురును తిరిగి అంతర్జాతీయ మార్కెట్‌లోకి తెచ్చేందుకు వెనిజులా కూడా భారత్‌తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మార్కో రుబియో అనంతరం ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ట్రంప్ తరఫున ఆహ్వానిం చారు. తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీ య శాంతిభద్రతలపై చర్చలు జరిగాయని తెలిపారు. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.






