18 April, 2026 | 12:01 PM

బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

18-04-2026 10:34 AM

ధర్మపురి,ఏప్రిల్18(విజయక్రాంతి): విద్యుత్ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం చెక్కులను అందజేశారు. ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య మూడు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్ తో మరణించడంతో చిన్నయ్య భార్య గటిక అమ్మాయికి రూ. 5 లక్షల పరిహారాన్ని రాయపట్నం గ్రామ పంచాయతీ వద్ద  జరిగిన కార్యక్రమంలో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. అదే విధంగా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన రాపాక మహేందర్ గేదె విద్యుత్ షాక్ తో మరణించడంతో ప్రభుత్వం తరఫున రూ. 40 వేల పరిహారాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.