దేనికైన సిద్ధం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి సవాల్
హైదరాబాద్: కాళేశ్వరం పేరుతో ప్రజల డబ్బులు దుర్వినియోగం చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల భవనాలు నిర్మించారా..? అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు మంచిగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారంలో ఉండి రాజలాగా విరవీగారని మంత్రి ఆగ్రహించారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి మహేందర్ రెడ్డి టిక్కెట్ లాక్కొని పోటీ చేశారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సీఎం పదవీ వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారని చెప్పారు. కేటీఆర్ ది ఎన్ఆర్ఐ కోటా అయితే సీఎం ది మెరిట్ కోటా అని అన్నారు.
బీఆర్ఎస్ హయంలో గురుకుల సంఖ్యను మాత్రమే పెంచిందని, ఒక గురుకుల భవనం నిర్మించాలేదని, ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. ఒక గురుకుల భవనం నిర్మించిన నేను దేనికైన సిద్ధమని కేటీఆర్ కు మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గురుకుల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 38 వేల మందికి దళితబంధు ఇచ్చి అందరికీ ఇచ్చామని మీడియా ముందు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తను ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను భుజం తట్టి ఇవాళ మంత్రిగా నిలబెట్టారని కొనియాడారు.






