ఇంటిపై నుంచి విద్యుత్ వైర్లు.. కర్రతో తాత్కాలిక రక్షణ..!
31-05-2026 02:00 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం బంబార గ్రామంలో ఓ ఇంటి పైనుంచి విద్యుత్ వైర్లు వెళ్లడం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. ఇంటి స్లాబ్‌కు వైర్లు తగలకుండా ఉండేందుకు ఆ ఇంటి యజమాని కర్ర సహాయంతో వాటిని ఎత్తుగా నిలిపి ఉంచారు. అయితే ఇది తాత్కాలిక పరిష్కారమేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో లేదా బలమైన గాలులు వీచే సమయంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైర్లను సురక్షిత దూరానికి మార్చి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.






