వీసీ చిత్రపటానికి క్షీరాభిషేకం
19-03-2026 12:07 AM
కొత్తపల్లి, మార్చి 18 (విజయ క్రాంతి): శాతవాహన యూనివర్సిటీలో తెలుగు విభాగానికి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్స్ పొం దిన సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ చిత్రపటానికి పి హెచ్డి స్కాలర్స్ క్షీరాభిషేకం చేసి అనంతరం బాణాసంచతో సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాతవాహన జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే మ హత్తర నిర్ణయం తీసుకున్న ఉపకులపతి ఆ చార్య ఉమేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీనారాయణ, డాక్టర్ పావని, డాక్టర్ జిడి రమేష్, స్వరాజ్యం మేడం, పిహె చ్డి స్కాలర్స్ నైతం మహేష్, బోడకుంట రమే ష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




