19 May, 2026 | 4:16 AM

రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

19-05-2026 12:00 AM

నిర్మల్, మే 18 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకా రులను గుర్తించి గౌరవించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు చేయ డం ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కమిటీ వల్ల తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కుతుందని జిల్లా కన్వీనర్ కొట్టు శేఖర్ తెలిపారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల ఆకాంక్షలను తీర్చేవిధంగా కమిటీ పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ జగన్, నిర్మల్ గద్దర్ షరీఫ్, డాక్టర్ వినోద్, బొల్లోజీ నర్సయ్య, సామల వీరయ్య, దొంతుల చంద్రశేఖర్, కూన భూమేష్,అంగ జగదీశ్, ఎం. శంకర్, కటికే శివాజీ తదితరులు పాల్గొన్నారు.