23 June, 2026 | 10:04 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

విద్యుద్ఘాతంతో పాడిగేదె మృతి

23-06-2026 08:59 PM

కారేపల్లి,(విజయక్రాంతి): విద్యుద్ఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె సోమవారం మేతకు గేటుకారేపల్లి హైస్కూల్ సమీపంలోని పోలాల వద్దకు వచ్చింది. ఆ ప్రాంతంలో బావులకు విద్యుత్ సరఫరా చేసే కరెంటు తీగలు క్రిందకు వేలాడుతున్నాయి. అక్కడికి మేతకు వచ్చిన గేదెకు తీగలు తగలి విద్యుద్ఘాతానికి గురై అక్కడి కక్కడే మృతి చెందింది. ఈ విషయమై విద్యుత్ అధికారులకు పిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. తమకు జీవనాధారమైన పాడి గేదె మృతి చెందిందని తమను ఆదుకోవాలని బాధితుడు అధికారులను వేడుకుంటున్నాడు.