దళిత రత్న గ్రహీత ఆరేకంటి యేసయ్యకు ఘన సన్మానం
దేవరకొండ,(విజయ క్రాంతి): దండోరా ఉద్యమంలో విశిష్ట సేవలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ పురస్కారాన్ని అందుకున్న ఆరేకంటి యేసయ్యకు మంగళవారం నేరేడుగొమ్ములో ఘనంగా సన్మానం జరిగింది. ఇటీవల ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో గౌరవించింది.
ఈ నేపథ్యంలో నేరేడుగొమ్ము గ్రామ పంచాయతీ సర్పంచ్ పులికంటి సుధాకర్ అధ్యక్షతన గ్రామ ప్రజలు, పలువురు నేతలు కలిసి యేసయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దళితుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యేసయ్యకు దళిత రత్న అవార్డు రావడం తమ ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీ ఆంజనేయులు, కంప్యూటర్ ఆపరేటర్ నాగిళ్ల శీను, చందంపేట డాక్టర్ రాజేష్, హెల్త్ టీమ్ సభ్యులు పులికంటి భాస్కర్, శ్యామ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




