గురుకులంలో గోరింటాకు సందడి
22-07-2026 06:39 PM
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ మహాత్మా జ్యోతిరాబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం గోరింటాకు వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు గోరింటాకు పెట్టుకొని ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుకన్య మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం, విద్యార్థుల్లో భారతీయ విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.






