దాతృత్వం చాటుకున్న మెగాస్టార్
21-04-2026 02:46 AM
మెగాస్టార్ చిరంజీవి మరోమారు దాతృ త్వం చాటుకున్నారు. తన సిబ్బందికి ఆపద కాలంలో అండగా నిలిచారు. గుండె శస్త్రచికిత్స కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్‌కు రూ.10.5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. అపోలో ఆసుపత్రిలో తన స్వీయ పర్యవేక్షణలో పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు. తన మాజీ మేనేజర్ కేవీ నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం రూ.9.5 లక్షలు అందించారు. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లోని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పొందిన రూ.10 లక్షలను కూడా చిరంజీవి పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే.






