ఇల్లందులో 56 రోజుల మెగా సమ్మర్ డాన్స్ క్యాంప్ నిర్వహణ
14-04-2026 04:03 PM
ఇల్లందు,(విజయక్రాంతి): పట్టణంలోని చిన్నారుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 56 రోజుల మెగా సమ్మర్ డాన్స్ క్యాంప్‌ను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కడారి వెంకటేష్, ఎలుకపల్లి సాయి తెలిపారు. స్థానిక ఎంఆర్‌జీ నారాయణ స్కూల్ ప్రాంగణంలో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. డాన్స్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులకు ప్రొఫెషనల్ శిక్షణతో పాటు శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ ప్రెజెన్స్ అభివృద్ధి చేయడం లక్ష్యమన్నారు. క్యాంప్ ముగింపున జూన్ 14న మెగా డాన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 8374579497, 7989163958, 9030099139 నంబర్లను సంప్రదించాలని కోరారు.






