3 July, 2026 | 11:22 AM

చేపల వేటకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతి

03-07-2026 10:22 AM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తిర్యాణి మండలంలోని చెలిమల వాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లింగిగూడ గ్రామానికి చెందిన సల్లం దినేష్ (26) చేపల వేట కోసం ప్రాజెక్టుకు వెళ్లి నీటిలో జారిపడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న తిర్యాణి ఎస్ఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు, సిబ్బంది, గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా కొనసాగిన గాలింపు అనంతరం శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోనే దినేష్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దినేష్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.