3 July, 2026 | 3:16 AM

క్యాబినెట్ భేటీకి మంత్రి సురేఖ డుమ్మా

03-07-2026 01:46 AM

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు వ్యవహారమే కారణమా?

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాం తి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి మంత్రి గైర్హాజర్ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విదేశీ పర్యటన ముగించుకుని బుధవారమే రాష్ట్రానికి వచ్చినప్పటికీ.. మరుసటి రోజు జరిగిన క్యాబినెట్ భేటీకి రాకపోవడం వెనక బలమైన కారణాలే ఉంటాయని భావిస్తున్నారు.

ప్రధాంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పా టు ప్రక్రియకు సంబంధించిన వ్యవహారమే మంత్రి కొండా సురేఖ అసంతృప్తి కి కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన శాఖకు సంబధించిన అత్యంత కీలకమైన బోర్డు ఏర్పాటు విషయంలో దేవాదాయ శాఖమంత్రిగా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదనే భావనతో సురేఖ ఉన్నట్లుగా తెలుస్తోంది.