దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 04:06 PM
ఇల్లందు,(విజయక్రాంతి): తెలంగాణ ఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేకల శ్యామ్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ మాదిగ, బొప్పి భాగ్య పాల్గొని మాట్లాడుతూ... అంబేద్కర్ దళితుల హక్కుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాళ్ల శివ మాదిగ, బోశాల దుర్గారావు, గుండెపాక కిరణ్, మెంతన ప్రకాష్, ఆలూరి వేణుగోపాల్, నేలమర్రి నాగరాజు, మేకల ప్రసాద్, సంపత్, సాగర్, కార్తీక్, అప్పారావు, నవతేజ, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.






