14 August, 2026 | 4:32 PM

ఈనెల 16న జయశంకర్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల సమావేశం

14-08-2026 03:25 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఈనెల 16వ తేది ఆదివారం ఉదయం 9 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్రిష్ణకాలనీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జిల్లా క్రీడాకారుల సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా క్రికెటర్స్ అసోసియేషన్ వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా క్రికెట్ పితామహుడు, క్రికెట్ క్రీడాకారులు కొలుగురి సంజీవరావు, సీనియర్ క్రీడాకారులు మురళి, సల్ల శ్రీనివాస్, దశరథం, రాంరెడ్డి, అంజి పాల్గోని క్రీడాకారులకు సలహాలు సూచనలు చేయడంతో పాటు రాబోయే రోజుల్లో జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించునున్నట్లు అసోసియేషన్ వారు తెలిపారు. కావున జిల్లా సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.