20 May, 2026 | 2:35 PM

దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్

20-05-2026 01:08 PM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్ కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడాయి. తెలంగాణలో 25 వేలకు పైగా మందుల దుకాణాలను మూసివేయగా, హైదరాబాద్ లో 12 వేలకు పైగా బంద్ ను పాటిస్తున్నాయి.

మెడికల్ షాపుల బంద్ దృష్ట్యా ప్రజలకు డీసీఏ సూచనలు చేశారు. ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న షాపులు తెరిచే ఉంటాయాని, అత్యవసర మందుల కోసం డ్రగ్ కంట్రోల్ అధికారిని సంప్రదించాలని డీసీఏ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, అధికారుల నంబర్లు, చిరునామా డీసీఏ వెబ్ సైట్ లో ఉంటాయని హామీ ఇచ్చారు. సాయం కోసం డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 సంప్రదించాలని వెల్లడించారు.