14 August, 2026 | 10:08 AM

ముత్యాలమ్మ తల్లి బోనం ఎత్తిన గోపతండ మహిళలు

14-08-2026 08:59 AM

మోతె, ఆగస్టు 14(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండా గ్రామంలో  ముత్యాలమ్మ తల్లి బోనాలెత్తిన మహిళలు, గ్రామ సర్పంచ్ భూక్యా బిక్కు నాయక్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామంలో పాడిపంటలతో గ్రామం ఆర్థిక అభివృద్ధి చెందాలని ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ సతీ సమేతంగా అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ మాలోత్ ఈశ్వరి రవి, డీలర్ సీతారాములు, మాజీ ఎంపీటీసి శ్రీరాములు, కోర్ర లక్ పతి, కోర్ర శివ, గ్రామ పెద్దలు. మహిళలు, తదితరులు పాల్గొన్నారు.