14 August, 2026 | 10:08 AM

ఎక్సలెంట్ పాఠశాలల డైరెక్టర్ ఖాదర్ మృతి

14-08-2026 09:05 AM

మణుగూరు, ఆగష్టు 14,(విజయక్రాంతి): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణుగూరు ఎక్సలెంట్ పాఠశాలల డైరెక్టర్ ఖాదర్ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థులకు ఆయన మార్గదర్శిగా ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.