14 August, 2026 | 11:41 AM

ఆరోగ్యం బాగుంటేనే లక్ష్యాన్ని చేదించగలం: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

14-08-2026 08:50 AM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : వ్యక్తి జీవితంలో ఆరోగ్యం బాగుంటేనే తన సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేయించగలరని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మహబూబ్‌నగర్ సైక్లింగ్ క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాను కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఆగస్టు 16న జరగనున్న 'MCC ఫ్రీడం రైడ్ 2026' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సైక్లింగ్‌ను ప్రోత్సహించడంలోనూ, ఆరోగ్యం మరియు శారీరక దృఢత్వంపై దాని ప్రయోజనాలను తెలియజేయడంలోనూ క్లబ్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇలాంటి సైక్లింగ్ కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. సైక్లింగ్ వల్ల కలిగే ఆనందాన్ని మరియు ప్రయోజనాలను అనుభవించేందుకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని MCC  ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు వావిల్ల వేణుగోపాల్ రెడ్డి, ఏ.ఏం.ఓ దుంకుడు శ్రీనివాస్, అనిరుధ్, శశాంక్, దిలీప్, శరత్ పాల్గొన్నారు.