14 August, 2026 | 9:54 AM

జీవితంపై విరక్తి చెంది మహిళ మృతి

14-08-2026 08:54 AM

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 14 (విజయక్రాంతి): జీవితంపై విరిక్తి చెంది మహిళ మృతి చెందిన ఘటన ధర్మారెడ్డి తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ధర్మ తండా గ్రామానికి చెందిన కేతావత్ జ్యోతి 2021 సంవత్సరంలో పాపన్నపేటకు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది.అయితే కేతావత్ జ్యోతి తరచూ మూర్చ రావడంతో వివాహం జరిగిన సంవత్సరంలోపే విడాకులు జరిగినట్లు తెలిపారు. విడాకుల అనంతరం కేతావత్ జ్యోతి తన తల్లి ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించింది.

పలు సార్లు వివిధ ఆస్పత్రిలో చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో 12వ తేదీన కేతావత్ జ్యోతి పొలంలో పురుగుల మందు పిచికారి చేసి మిగిలిన పురుగుల మందులు ఇంటికి తీసుకువచ్చి బాత్రూంలో ఉంచింది. అదే రోజు రాత్రి తల్లి కూతురు పడుకున్నారు.కొద్దిసేపటి తర్వాత జ్యోతి నోటి నుండి బుడగలు రావడం గమనించి తల్లి కుటుంబ సభ్యుల సహాయంతో ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.అప్పటికే కేతావత్ జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. తల్లి కేతావత్ అన్సి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.