19 May, 2026 | 7:30 AM

20న మెడికల్ షాపుల బంద్

19-05-2026 12:00 AM

చిట్యాల, మే 18 : చిట్యాల మున్సిపాలిటీ, మండల పరిధి గ్రామాలలో ఈనెల 20న మెడికల్ షాపులను బంధు చేయనున్నట్లు మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లపు నరేందర్ తెలిపారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టుల  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసిల్దార్ విజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం బంద్ విషయమై మున్సిపల్, పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సత్యనారాయణ, భాస్కర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.